Indian Student Missing : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి మిస్సింగ్
అమెరికాలో(AMerica) భారతీయ విద్యార్థుల(Indian Student) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులపై(Telugu Students) దాడులు పెరుగుతున్నాయి. వరుస మరణాలు, అదృశ్య ఘటనలు కలవరం రేపుతున్నాయి.
అమెరికాలో(America) భారతీయ విద్యార్థుల(Indian Student) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులపై(Telugu Students) దాడులు పెరుగుతున్నాయి. వరుస మరణాలు, అదృశ్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. లేటెస్ట్‌గా కాలిఫోర్నియా(California) స్టేట్‌లో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి కనిపించకుండా పోయింది. నితీశ కందుల(Nithisha Kandhula) అనే యువతి లాస్ ఏంజిలిస్‌లోని(LA) ఎల్లెండేల్ ప్రాంతంలో ఉంటోంది. స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుకుంటోంది. మే 28వ తేదీ నుంచి నితీశ కనిపించకుండా పోయింది. దీంతో ఆ అమ్మాయి బంధువులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న లాస్ ఏంజిలిస్ పోలీసులు ఆ అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. నితీశ గురించిన సమాచారం తెలిస్తే తమకు తెలియచేయాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా సూచించారు.