ఓ ఎంబీఏ విద్యార్థిని(MBA Student) పెళ్లి కాకుండానే తల్లి అయింది. బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇదే విషయం తల్లిదండ్రులకు తెలియకూడదని బిడ్డను రోడ్డుపై పడేసింది. దీంతో బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని కొచ్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళలోని(Kerala) కొచ్చిలో(Kochi) ఎంబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని పెళ్లి కాకుండానే తల్లి అయింది. తను ఉంటున్న అపార్ట్‌మెంట్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విషయం ఇంట్లో తెలుస్తుందని భయపడింది. తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే పరువుపోతుందని భావించి శిశువును రోడ్డుపై పడేసింది. అమెజాన్ పార్శిల్ కవర్‌లో(amazon Parcel cover) శిశువును చుట్టి అపార్ట్‌మెంట్ బాల్కానీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో ఆ శిశువు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కడే ఉన్న కొందరు కార్మికులు శిశువు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్శిల్ కవర్‌పై ఉన్న అడ్రస్‌తో నిందితురాలిని గుర్తించారు. దీంతో ఆ విద్యార్థినిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అసలే పెళ్లి కాకుండానే తల్లి కావడం ఒక పిచ్చి పని అయితే.. తల్లిదండ్రులకు విషయం తెలియకూడదని ఆ బిడ్డను విసిరివేసి మరో పిచ్చి పనిచేయడంంతో ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది కదా అని స్థానికులు గొణుక్కుంటున్నారు.