ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను ఓ భారతీయుడు సృష్టించారు.

ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను ఓ భారతీయుడు సృష్టించారు. ఇల్లు, ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలలో తప్పనిసరిగా వాక్యూమ్ క్లీనర్‌(vacuum cleaner)ని చూసి ఉంటారు కానీ ఇంత చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను చూసి ఉండకపోవచ్చు. చాలా కంపెనీలు కాంపాక్ట్ వాక్యూమ్‌లను తయారు చేస్తున్నప్పటికీ, ఈ ప్రపంచంలోని అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ మనిషి వేలుగోళ్ల కంటే చిన్నది. దీని పరిమాణం 0.65 సెంటీమీటర్లు (0.25 అంగుళాలు).

ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను నాదాముని అనే 23 ఏళ్ల భారతీయుడు సృష్టించాడు. ఈ వాక్యూమ్ క్లీనర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌(Guinness world record)లో నమోదైంది. నాదముని కొత్త వాక్యూమ్ క్లీనర్ 0.65 సెంటీమీటర్లు (0.25 అంగుళాలు) మాత్రమే, ఇది మానవ వేలి గోరు కంటే చిన్నది. ఈ పరికరం 2022లో చేసిన మునుపటి రికార్డు కంటే 0.2 సెం.మీ చిన్నది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇది నమోదైంది. 2020 సంవత్సరంలో కూడా, నాదాముని 1.76 సెం.మీ వాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేశారు. అతని రికార్డును అతనే బద్దలు కొట్టాడు. నాదముని చాలా కష్టపడి 2024లో కొత్త డిజైన్‌తో రికార్డును తిరిగి పొందాడు. ఈసారి పెన్ను కంటే చిన్నదైన వాక్యూమ్ క్లీనర్‌ని సిద్ధం చేశాడు. ఈ అతిచిన్న వాక్యూమ్‌ క్లీనర్‌పై సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

ehatv

ehatv

Next Story