వాడికేం.. రాళ్లు తిని కూడా అరిగించుకోగలడు అంటుంటారు కాసింత గట్టివాళ్లను చూసి.. రాజస్తాన్‌(Rajasthan) రాజధాని జైపూర్‌లో(Jaipur) ఉన్న ఓ యువకుడు గట్టివాళ్లకే గట్టివాడు. ఏంచేతంటే అతగాడి పొట్టలో మేకులు(Nails), సూదులు(Needles), తాళం చెవులు(Keys), నట్లు, బోల్టులు ఇలా ఓ లోహపు భాండారమే ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్న 21 ఏళ్ల ఆ యువకుడు మొన్నామధ్యన జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆసుపత్రిలో చేరాడు.

వాడికేం.. రాళ్లు తిని కూడా అరిగించుకోగలడు అంటుంటారు కాసింత గట్టివాళ్లను చూసి.. రాజస్తాన్‌(Rajasthan) రాజధాని జైపూర్‌లో(Jaipur) ఉన్న ఓ యువకుడు గట్టివాళ్లకే గట్టివాడు. ఏంచేతంటే అతగాడి పొట్టలో మేకులు(Nails), సూదులు(Needles), తాళం చెవులు(Keys), నట్లు(Nuts), బోల్టులు(Bolts) ఇలా ఓ లోహపు భాండారమే ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్న 21 ఏళ్ల ఆ యువకుడు మొన్నామధ్యన జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ వగైరా పరీక్షలు చేశారు. అతడి పొట్టలో ఇనుప వస్తువులు పేరుకుపోయినట్టు గమనించారు. వాటిలో కొన్ని పెద్ద పేగులోకి కూడా వెళ్లాయట! దాంతో వైద్య బృందం అతడికి లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ చేసింది. మూడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి పొట్టలో ఉన్న ఇనుప వస్తువులన్నీ తొలగించింది. కడుపులోంచి బయటపడిన వస్తువులను చూసి డాక్టర్లకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. పాపం ఆ యువకుడి మానసిక స్థితి సరిగా లేదట. అందుకే ఇనుప మేకులు, సూదులు వంటివి మింగేవాడట!

Updated On 28 May 2024 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story