ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh), ఒడిశాల అసెంబ్లీ ఎన్నికలు(Odisa Assembly Elections) దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న 21 గ్రామాలతో కూడిన కొటియా క్లస్టర్‌(Kotia cluster) మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆంధప్రదేశ్‌, ఒడిశాల సరిహద్దులో, విశాఖపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో మారుమూల కొండలలో కొన్ని వివాదాస్పద గ్రామాలు ఉననాయి.

ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh), ఒడిశాల అసెంబ్లీ ఎన్నికలు(Odisa Assembly Elections) దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న 21 గ్రామాలతో కూడిన కొటియా క్లస్టర్‌(Kotia cluster) మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆంధప్రదేశ్‌, ఒడిశాల సరిహద్దులో, విశాఖపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో మారుమూల కొండలలో కొన్ని వివాదాస్పద గ్రామాలు ఉననాయి. బ్రిటిష్‌ కాలం నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. ఈ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ రెండు ఓటు కార్డులతో(Voter Cards) పాటు రెండు రేషన్‌కార్డులు(Ration Cards) ఉంటాయి. అన్నట్టు వీరికి రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కూడా అందుతుంటాయి. ఈ 21 గ్రామాలు ఒడిశాలోని కోరాపుట్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. అలాగే పొత్తంగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మళ్లీ ఇవే గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి, అలాగ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాబట్టి రెండు రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు వీరు ఓట్లు వేస్తారు. ఇదో చిత్రమైన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ సాల్వ్‌ కావడం లేదు.

Updated On 6 May 2024 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story