కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువలతిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం హౌస్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 40 మంది ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు 21 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి షిజు కెకె తెలిపారు. బోటులో ఎంత మంది ఉన్నారనేది మాకు ఖచ్చితంగా తెలియదు.

కేరళ(Kerala)లోని మలప్పురం(Malappuram) జిల్లా తానూర్(Thanur) ప్రాంతంలోని తువలతిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం హౌస్ బోట్(House Boat) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 40 మంది ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు 21 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి షిజు కెకె తెలిపారు. బోటులో ఎంత మంది ఉన్నారనేది మాకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఇంకా ఎక్కువ మంది బాధితులు లోప‌ల‌ చిక్కుకున్నారో లేదో తెలుసుకోవడానికి మేము శోధనను కొనసాగిస్తున్నామని అన్నారు.

ప్రమాదం తర్వాత ఆరోగ్య మంత్రి వీణా జార్జ్(Veena George) పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులకు ప్రత్యేక వైద్యం అందేలా చూడాలని.. పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా మృతదేహాలను వీలైనంత త్వరగా బంధువులకు అప్పగించాలని జార్జ్ ఆదేశించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. తిరుర్, తిరురంగడి, పెరింతల్మన్న ఆసుపత్రులు, మనచేరి మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించేందుకు త్రిసూర్, కోజికోడ్ జిల్లాల నుంచి వైద్యులతో సహా సరిపడా సిబ్బందిని పిలిపించాలని పేర్కొంది.

ఘటనా స్థలాన్ని సోమవారం సీఎం విజయన్‌(Pinayai Vijayan) సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది. ప్రకటన ప్రకారం.. సోమవారం అధికారిక సంతాప దినంగా ప్రకటించబడింది. బాధితుల గౌర‌వార్ధం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయి.

మలప్పురం పడవ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సంతాపం తెలిపారు. కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రజలు మరణించడం చాలా దిగ్భ్రాంతికరం, బాధాకరమని రాష్ట్రపతి ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విచారం వ్యక్తం చేశారు. కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రజలు మరణించడం నాకు బాధ కలిగించిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated On 7 May 2023 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story