2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపూర్ నుంచి బరిలో దిగారు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు రామ్‌పుర్ ట్రయల్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్ట్ చేయాలంటూ రామ్‌పుర్ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లఘించిన కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పుర్ కోర్టు విచారిస్తోంది. ఈ మేరకు జయప్రదకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను నిలిపివేయాలంటూ జయప్రద అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపూర్ నుంచి బరిలో దిగారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జయప్రద మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ కొన్ని పనులు చేయడంతో ఆమెపై స్వార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లోనే ఉంది. అప్పటి నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది. ఆమె కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. కోర్టుకు గైర్హాజరు అవుతూనే వస్తోంది. దాంతో.. కోర్టు జయప్రద పరారీలో ఉన్నట్లు గతంలో ప్రకటించింది. ఆపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కూడా జారీ చేసింది. ఈ వారెంట్‌ను సవాల్ చేస్తూ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది నటి జయప్రద. తాజాగా హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.