కోల్‌కతా(Kolkata)లో ట్రయినీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది.
కోల్‌కతా(Kolkata)లో ట్రయినీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. ఘాతుకానికి పాల్పడ్డవారిని కఠినాతికఠినంగా శిక్షించాలంటూ నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అదే సమయంలో దేశంలో చాలా చోట్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే! మహారాష్ట్ర(Maharashtra)లో నర్సింగ్ విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్(Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు. రత్నగిరి(Ratnagiri)లో20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి(Trainee Nurse)ని క్లాసులు అయ్యాక ఇంటికి వెళ్లడానికి ఆటో మాట్లాడుకుంది. దారిలోఆమెతో మాటలు కలిపిన ఆటో డ్రైవర్ తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో మత్తు మందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. తనపై లైంగిక దాడి జరిగినట్టుగా తెలుసుకున్న బాధితురాలు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి బంధువులు, స్థానికులు, డాక్టర్లు, నర్సులు అర్ధరాత్రి రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.