టాటూ వేయించుకున్న 20 మంది మహిళలకు హెచ్ఐవీ అంటుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టాటూ వేయించుకున్న 20 మంది మహిళలకు హెచ్ఐవీ అంటుకుంది. జిల్లా మహిళా ఆసుప్రతిలో జరిపిన ఆరోగ్య పరీక్షలలో ఈ దారుణం బయటపడింది. మొత్తం 68 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇందులో 20 మంది రోడ్డు పక్కన ఉన్న టాటూ ఆర్టిస్టుల నుంచి పచ్చబొట్టు వేయించుకున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత వీరు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. వారిలో హచ్‌ఐవీ లక్షణాలు కనిపించసాగాయి. టాటూ వేసేవాడు ఒకే సూదితో అందరికీ పచ్చబొట్టు వేశాడు. ఈ కారణంగానే అందరికీ ఎయిడ్స్‌ సోకింది. ప్రతి ఏడాది మహిళలకు నిర్వహించే వైద్య పరీక్షలలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ పరీక్షలు కూడా చేస్తారు. ఎప్పటిలాగే పరీక్షలు నిర్వహిస్తే 68 మంది మహిళలలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 20 మంది రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్నవారేనని ఆసుపత్రిలోని హెచ్ఐవీ కౌన్సెలర్‌ ఉమా సింగ్‌ చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story