Earthquake In Chennai : చైనాలో భారీ భూకంపం.. కుప్పకూలిన 126 భవనాలు
చైనాలోని(chennai) షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో(Shandong Province) భూకంపం సంభవించింది. డెజౌ సిటీలోని పింగ్యువాన్ కౌంటీలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రం తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం.. భూకంపం కారణంగా 126 భవనాలు(Biulding) కుప్పకూలాయి.
చైనాలోని(chennai) షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో(Shandong Province) భూకంపం సంభవించింది. డెజౌ సిటీలోని పింగ్యువాన్ కౌంటీలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రం తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం.. భూకంపం కారణంగా 126 భవనాలు(Buildings) కుప్పకూలాయి. భూకంపం ధాటికి 20 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రం డెజౌ నగరానికి దక్షిణంగా 26 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) 5.8 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం హిందూకుష్ ప్రాంతం. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.
జమ్మూ కాశ్మీర్‌లో కూడా శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.7గా నమోదైంది. భూకంప కేంద్రం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్. ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లలేదు.