గుజరాత్‌ను(Gujarat) అకాలవర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో(Rains) ప్రజలు బెంబేలెత్తారు. కొన్ని చోట్ల వడగండ్ల(Hail strom) వాన పడింది. పలు ప్రాంతాలలో పిడుగులు(Thunders) పడి 20 మంది చనిపోయారు.
గుజరాత్‌ను(Gujarat) అకాలవర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో(Rains) ప్రజలు బెంబేలెత్తారు. కొన్ని చోట్ల వడగండ్ల(Hail strom) వాన పడింది. పలు ప్రాంతాలలో పిడుగులు(Thunders) పడి 20 మంది చనిపోయారు. దాహోద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో మరో 11 మంది మరణించారని అన్నారు. అకాల వర్షాలతో పలువురు మృతిచెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.అటు రాజస్థాన్ (Rajasthan), మహారాష్ట్ర (Maharashtra)లోనూ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను (Cyclone) ఏర్పడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.