మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వేదికగా ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.

20 MPs of INDIA bloc head to conflict-hit Manipur to assess situation on ground
మణిపూర్(Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వేదికగా ప్రధాని(PM Modi) ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల కూటమి 'I-N-D-I-A' (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్)కి చెందిన 20 మంది ఎంపీల బృందం.. ఈరోజు మణిపూర్‌లో పర్యటించేందుకు బయలుదేరింది. ఈ ఎంపీలు హింస ప్రభావిత ప్రాంతాలను, సహాయక శిబిరాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తారు.
ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ పీపీ మహ్మద్ ఫైజల్ మాట్లాడుతూ.. ఈరోజు మణిపూర్ వెళ్తున్నామని తెలిపారు. అక్కడి ప్రజల బాధలు అర్థం చేసుకునేందుకు మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రతిపక్ష ఎంపీగా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. తాము హింసాత్మక ప్రాంతాలు, సహాయక శిబిరాలను సందర్శించనున్నట్లు తెలిపారు.
20 మంది నేతల బృందంలో అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కె సురేష్(Congress), సుస్మితా దేవ్(TMC), సుశీల్ గుప్తా(AAP), అరవింద్ సావంత్(శివసేన (UBT), కనిమొళి కరుణానిధి(DMK), రాజీవ్ రంజన్ సింగ్ మరియు అనీల్ ప్రసాద్ హెగ్డే(JD(U)), సంతోష్ కుమార్ (CPI), AA రహీమ్ (CPIM), మనోజ్ కుమార్ ఝా (RJD), జావేద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), మహువా మాజి (JMM), PP మహమ్మద్ ఫైజల్ (NCP), ET మహమ్మద్ బషీర్ (IUML), NK ప్రేమచంద్రన్ (RSP), D రవికుమార్ (VCK), తిరు తోల్ తిరుమావళవన్ (VCK), జయంత్ సింగ్ (RLD) ఉన్నారు.
రాజకీయ సమస్యలను లేవనెత్తడానికి కాదు, మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మేము అక్కడికి వెళ్తున్నామని అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) అన్నారు.
