కర్ణాటకలో(Karnataka) మంకీ ఫీవర్(Monkey fever) విజృంభిస్తోంది. ఇప్పటికే మంకీ ఫీవర్‌తో ఇద్దరు చనిపోవడం భయాందోళనలను కలిగిస్తోంది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలకు ఉపక్రమించారు.

Karnataka Monkey Fever
కర్ణాటకలో(Karnataka) మంకీ ఫీవర్(Monkey fever) విజృంభిస్తోంది. ఇప్పటికే మంకీ ఫీవర్‌తో ఇద్దరు చనిపోవడం భయాందోళనలను కలిగిస్తోంది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలకు ఉపక్రమించారు. జనవరి 8వ తేదీన శివమొగ్గ జిల్లా హెసనగర తాలూకాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఇదే వ్యాధితో చనిపోయింది. తాజాగా ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన 79 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు మంకీ ఫీవర్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం(High fever), ఒళ్లు నొప్పులు(Body pains), తలనొప్పి(Head ache) కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్(Vaccine) వేయించేందుకు ఐసీఎంఆర్(ICMR) ప్రతినిధులతో వైద్యులు సంప్రదింపులు జరుపుతున్నారు.
