పార్లమెంట్‎లో(Parliament) భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే పార్లమెంట్‎లోకి ఇద్దరు అగంతకులు చొరబడటం సభలో ఉన్న ఎంపీలను షాక్ గురి చేసింది. మూడంచెల సెక్యూరిటీ కళ్లు గప్పి టియ్యార్ గ్యాస్‎తో(Tear gas) పార్లమెంట్‎లోకి ఎలా వచ్చారు? అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా పార్లమెంటులో భద్రతా డొల్లతనం మరోసారి కొట్టొచ్చినట్లు కనపడింది. పార్లమెంట్‎పై దాడి జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా భద్రతా సిబ్బంది ఏ మాత్రం అలర్ట్‎గా లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విపక్ష ఎంపీలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

వివరాల్లోకి వెళ్తే.. పార్లమెంట్‎లో జీరో అవర్‌(Zero Hour) జరుగుతుండగానే.. ఇద్దరు అగంతకులు లోక్‌సభలోకి(Lok Sabha) చొరబడ్డారు. విజిటర్స్‌ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. తమ షూలలో దాచుకుని తెచ్చిన పసుపురంగులో ఉండే ఒకరకమైన గ్యాస్‌ టిన్స్‌ ఓపెన్‌చేసి విసిరారు. దీంతో పార్లమెంటు సభ్యులు భయంతో పరుగులు తీశారు. సభలోకి టియర్‌ గ్యాస్‌ వదలడంతో కొంత మంది సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో అలర్ట్ అయిన స్పీకర్‌ సభను కాసేపు వాయిదా వేశారు.

పార్లమెంట్ అంటేనే శత్రు దుర్భేధ్యమైన ప్రాంతం. పార్లమెంట్‎లోకి వెళ్లాలంటే మూడెంచల సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా సెక్యూరిటీ ఆపేస్తారు. అలాంటి భద్రత కలిగిన పార్లమెంట్‎లోకి ఇద్దరు వ్యక్తులు టియ్యర్ గ్యాస్ ఎలా తీసుకువెళ్లారు? అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యమేనంటున్నారు(Scurity negligence) విపక్ష ఎంపీలు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‎పై జరిగిన ఉగ్ర దాడిలో అమరులైన వారికి నివాళులర్పించిన రోజే..ఇద్దరు అగంతకులు సభలోకి ప్రవేశించి..టియ్యర్ గ్యాస్ ప్రయోగించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంట్‎లో కలర్‎స్మోక్ దాడిలో(Color Scope Attack) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంటులోకి చొరబడిన ఇద్దరితోపాటు..బయట మరో ఇద్దరిని గుర్తించారు. సోషల్ మీడియాలో పరిచయమై.. స్నేహితులుగా మారిన సాగర్ శర్మ(Sagar sharma), మనోరంజన్(Manoranjan), నీలమ్(Neelam), అమోల్..పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్ లోకి చొరబడినట్టు తెలుస్తోంది. ఎంపీ ప్రతాప్ సింహా పేరిట నిందితులకు విజిటర్స్ పాస్‎లు రిలీజ్ అయ్యాయి. తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడం వల్లే విజిటర్స్ పాస్ రెకమండ్ చేసినట్టు ఎంపీ చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని ఇటీవల ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు దాడి చేయడానికి వచ్చారా.. లేక నిరసన తెలుపడానికి వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే.. 13 డిసెంబర్ 2001 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనం ఆవరణలోకి ఓ తెల్లరంగు అంబాసిడర్ కారు దూసుకొచ్చింది. ఫేక్ ఐడీ కార్డులు ధరించి కారుకు ఎర్రబుగ్గ పెట్టి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆ కారు దూసుకొచ్చింది. లోక్‌సభ వాయిదా పడిన 40 నిమిషాలకు ఉగ్రవాదులు పార్లమెంట్ లోకి ప్రవేశించారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, విపక్షనేతగా సోనియాగాంధీ అక్కడి నుంచి వెళ్లిపోగా మరో 100 మంది ఎంపీలు, కేంద్ర హోంమంత్రి ఎల్‌కే అద్వానీలు ఇంకా భవనంలోనే ఉన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా..అందులో ఆరుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‎పై దాడి ఘటన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి.

Updated On 13 Dec 2023 6:42 AM GMT
Ehatv

Ehatv

Next Story