మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆటో రిక్షాను ఢీకొనడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందగా, ఆరుగురు జవాన్లతో సహా మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కాంప్టీలోని గార్డ్స్ రెజిమెంట్ సెంటర్‌కు చెందిన ఎనిమిది మంది జవాన్లు ఆటో రిక్షాలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు సాయంత్రం 5.30 గంటల సమయంలో కన్హాన్ నది వంతెన సమీపంలోకి రాగానే, ఆటో రిక్షాను బస్సు ఢీకొట్టింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

15 మంది జవాన్లు రెండు ఆటో రిక్షాల్లో కన్హాన్‌లో షాపింగ్‌కు వెళ్తున్నారు. వీరి వాహనాన్ని పావల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఇతర ఆటో రిక్షాలో ఉన్న జవాన్లు, స్థానికులు సైనికులను బయటకు తీశారని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సైనికులు విఘ్నేష్, ధీరజ్ రాయ్ మరణించగా, దిన్ ప్రధాన్, కుమార్ పి, శేఖర్ జాదవ్, అరవింద్, మురుగన్, నాగరత్నం చికిత్స పొందుతున్నారు. ఆటో డ్రైవర్ శంకర్ ఖరక్‌బన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టారు.


Eha Tv

Eha Tv

Next Story