కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రిగా కాంగ్రెస్(Congress) సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva kummar) కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రిగా కాంగ్రెస్(Congress) సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva kummar) కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేల గురించి తెలుసుకుందాం.

సిద్ధరామయ్య, శివకుమార్‌లతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ప్రముఖ నాయకులలో జి పరమేశ్వర(G.Parmeshwar), రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, లింగాయత్ నాయకుడు ఎంబి పాటిల్ ఉన్నారు. కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, రామలింగా రెడ్డి కూడా మంత్రులు అయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జి పరమేశ్వర మరియు ప్రియాంక్ ఖర్గే, మునియప్ప దళిత వర్గానికి చెందినవారు. జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్ మైనారిటీ వర్గానికి చెందినవారు. సతీష్ జార్కిహోళి షెడ్యూల్డ్ తెగకు చెందినవారు కాగా, రామలింగారెడ్డి రెడ్డి కులానికి చెందినవారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. డిప్యూటీ సీఎం శివకుమార్ వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన‌వారు.

ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge)

2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక్ ఖర్గే తొలిసారి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రియాంక్ ఖర్గే. ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న స్థానం నుంచి 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

KJ జార్జ్(KJ Georg)

హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వంలో కేలచంద్ర జోసెఫ్ జార్జ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు కర్నాటక హోంమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. వీరేంద్ర పాటిల్ ప్రభుత్వంలో రవాణా, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఎస్ బంగారప్ప ప్రభుత్వంలో గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. KJ జార్జ్ 1968లో కాంగ్రెస్‌లో చేరారు.

జీ పరమేశ్వర(G Parmeshwar)

కాంగ్రెస్ నాయకుడు జీ పరమేశ్వర గ‌తంలో పీసీసీ అధ్యక్షుడిగా ప‌నిచేశారు. కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జి పరమేశ్వర 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌ 1989లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

సతీష్ జార్కిహోళి(Satish Jarkiholi)

సతీష్ జార్కిహోలి కర్ణాటకలోని ప్రభావవంతమైన నాయక్/వాల్మీకి వర్గానికి చెందినవారు. వీరిని బెలగావి జిల్లాలో వడ్డీ వ్యాపారులుగా పిలుస్తారు. సతీష్ జార్కిహోళి 2008లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్ప‌టికి మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు.

కె హెచ్ మునియప్ప(KH Muniyappa)

కంబదహళ్లి హనుమప్ప మునియప్ప వరుసగా ఏడుసార్లు కోలార్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు.

రామలింగారెడ్డి(Ramlinga Reddy)

రామలింగారెడ్డి ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా రామలింగారెడ్డి బాధ్యతలు చేపట్టారు. దీంతో పాటు పలు కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇందిరాగాంధీ, డి.దేవరాజ్‌ల పేదరిక నిర్మూలన కార్యక్రమాల స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరారు.

జమీర్ అహ్మద్ ఖాన్(Zameer Ahmed Khan)

జమీర్ అహ్మద్ ఖాన్ కర్ణాటకలోని చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేషనల్ ట్రావెల్స్ మేనేజింగ్ పార్టనర్ కూడా. జమీర్ అహ్మద్ ఖాన్ గత కర్ణాటక ప్రభుత్వంలో హజ్, వక్ఫ్ బోర్డు మంత్రిగా ఉన్నారు.

M B పాటిల్ (MB Patel)
మల్లంగౌడ బసనగౌడ పాటిల్ కర్ణాటక హోంమంత్రిగా పనిచేశారు. దీంతోపాటు జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఎంబీ పాటిల్‌ బాధ్యతలు చేపట్టారు. పాటిల్ ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాటిల్ ప్రభావవంతమైన లింగాయత్ వర్గానికి చెందినవారు.

Updated On 20 May 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story