ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) దిగ్భ్రాంతి కలిగించే సంఘటన జరిగింది. సభ్య సమాజం ఉలిక్కిపడేట్టు చేసిన ఆ దారుణమైన ఘటన కస్‌గంజ్‌లో(Kasganj) చోటు చేసుకుంది. 19 ఏళ్ల కుర్రాడు ఒకడు మైనర్ అయిన తన చెల్లెలిపై అత్యాచారం(Rape) చేసి, ఆపై ఆ బాలికను హత్య చేశాడు. సంజూ అనే కుర్రాడు తన మొబైల్ ఫోన్‌లో తరచూ పోర్న్ వీడియోలు(Porn videos) చూసేవాడట! అలా ఆ సెక్స్ వీడియోలు చూసిన తర్వాత తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) దిగ్భ్రాంతి కలిగించే సంఘటన జరిగింది. సభ్య సమాజం ఉలిక్కిపడేట్టు చేసిన ఆ దారుణమైన ఘటన కస్‌గంజ్‌లో(Kasganj) చోటు చేసుకుంది. 19 ఏళ్ల కుర్రాడు ఒకడు మైనర్ అయిన తన చెల్లెలిపై అత్యాచారం(Rape) చేసి, ఆపై ఆ బాలికను హత్య చేశాడు. సంజూ అనే కుర్రాడు తన మొబైల్ ఫోన్‌లో తరచూ పోర్న్ వీడియోలు(Porn videos) చూసేవాడట! అలా ఆ సెక్స్ వీడియోలు చూసిన తర్వాత తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంట్లో చెబుతుందన్న భయంతో సోదరిని సంజూ హత్య చేశాడు. కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ విషయాలు తెలిసినట్టు పోలీసులు తెలిపారు. తన మేనల్లుడు సంజూ గురించి అతని మామ ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితుడి కోసం పోలీసులు గాలించారు. సోమవారం సాయంత్రం సంజూను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సంజూ తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. తల్లి, సోదరితో కలిసి అతను జీవిస్తున్నాడు. అయితే అఘాయిత్యం జరిగిన రోజున తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ కుర్రాడు తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.