మానవత్వానికి ఎల్లలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనం. నిత్యం మతాలు, కులాలంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటున్న ఈ కాలంలో చెన్నై ఎంజీఎం ఆస్పత్రి(MGM Hospital) వైద్యులు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవత్వానికి హద్దులు లేవనే విషయం మరోసారి రుజువైంది గుండె సంబధిత వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన యువతికి ఓ భారతీయుడి గుండెను అమర్చి(Heart transplantation) మానవత్వాన్ని చాటుకున్నారు.
మానవత్వానికి ఎల్లలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనం. నిత్యం మతాలు, కులాలంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటున్న ఈ కాలంలో చెన్నై ఎంజీఎం ఆస్పత్రి(MGM Hospital) వైద్యులు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవత్వానికి హద్దులు లేవనే విషయం మరోసారి రుజువైంది గుండె సంబధిత వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన యువతికి ఓ భారతీయుడి గుండెను అమర్చి(Heart transplantation) మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో ఆ యువతికి కొత్త జీవితం ప్రసాదించారు వైద్యుల రూపంలో ఉన్న దేవుళ్లు. చెన్నైలోని ఆస్పత్రి వైద్యుల బృందం ఆమెకు గుండెను విజయవంతంగా అమర్చారు.
వివరాలు చూస్తే.. పాకిస్తాన్‌కు చెందిన యువతి 19 ఏళ్ల రశన్ హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రానురాను ఆమె పరిస్థితి మరింత విషమించింది. గుండె మార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుండె మార్పిడి చేయకుంటే వ్యాధి విస్తరించి ఎక్కువ కాలం బతకలేదని వెల్లడించారు. ఇందుకు దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోదించారు. ఇంతలోనే రశన్ వివరాలు తెలుసుకున్న ఓ స్వచ్చంధ సంస్థ.. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులను ఆ సంస్థ సంప్రదించింది. అందుకు ఎంజీఎం వైద్యులు కూడా అంగీకరించారు. ఓ భారతీయ యువకుడికి చెందిన గుండెను పాకిస్తాన్ యువతి రశన్‌కు విజయవంతంగా మార్పిడి చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో కష్టపడి శస్త్రచికిత్సను పూరిచేశారు. దీంతో యువతి ఆరోగ్యంపై భరోసా ఏర్పడింది. ప్రస్తుతం రశన్ పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. తమ కూతురు ప్రాణాలు కాపాడిని స్వచ్చంధ సంస్థ ప్రతినిధులకు, ఎంజీఎం వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుల రూపంలో ఉన్న దేవుళ్లు మీరని తమకు సాయం చేసిన వారిని కొనియాడారు.