మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి బుధవారం సాయంత్రం కోచింగ్ క్లాస్‌లో(Coaching) గుండెపోటుతో(Heart attack) మరణించాడు. నగరంలోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్(Madhav), మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC)ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి బుధవారం సాయంత్రం కోచింగ్ క్లాస్‌లో(Coaching) గుండెపోటుతో(Heart attack) మరణించాడు. నగరంలోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్(Madhav), మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC)ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్‌లో ఉండగా అతనికి ఛాతీ నొప్పితో తన డెస్క్‌పైకి ఒరిగిపోయాడు. మాధవ్ మొదట్లో బాగానే ఉన్నా అకస్మాత్తుగా డెస్క్‌పై వాలిపోయాడు.
తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ విషాదకర ఘటన మొత్తం రికార్డయింది. దీంతో పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దాడు, నొప్పిగా ఉందా అని అడిగాడు. కొన్ని సెకన్ల తర్వాత మాధవ్ పూర్తిగా కుప్పకూలి, తన డెస్క్ నుంచి జారి నేలపై పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా క్లాస్‌రూంలో అలజడి నెలకొంది. మాధవ్ కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు సహాయం చేయడానికి పరుగెత్తారు. వెంటనే హుటాహుటిన అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాధవ్ మృతిచెందాడు. ఇంత చిన్నవయసులో గుండెపోటు రావడం, కళ్లముందే మాధవ్ చనిపోవడంతో తోటి విద్యార్థులు కలత చెందారు.