సోషల్ మీడియాలో(Social media) పాపులరవ్వడానికి, వ్యూస్‌(Views) అధికంగా రాబట్టుకోవడానికి యువత పిచ్చిపిచ్చి పనులన్నీ చేస్తోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పొగొట్టుకుంటోంది. ఇలాగే జార్ఖండ్‌కు(Jharkhand) చెందిన ఓ టీనేజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌(Instagram Reels) కోసం సాహసం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. అది కూడా స్నేహితుల కళ్ల ముందరే! మొబైల్‌లో ఆ సాహసాన్ని చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

సోషల్ మీడియాలో(Social media) పాపులరవ్వడానికి, వ్యూస్‌(Views) అధికంగా రాబట్టుకోవడానికి యువత పిచ్చిపిచ్చి పనులన్నీ చేస్తోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పొగొట్టుకుంటోంది. ఇలాగే జార్ఖండ్‌కు(Jharkhand) చెందిన ఓ టీనేజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌(Instagram Reels) కోసం సాహసం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. అది కూడా స్నేహితుల కళ్ల ముందరే! మొబైల్‌లో ఆ సాహసాన్ని చిత్రీకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. జార్ఖండ్‌ షాహిబ్‌గంజ్‌కు చెందిన 18 ఏళ్ల తౌసిఫ్‌ వంద ఫీట్ల క్వారీ లేక్‌లోకి దూకాడు. స్నేహితులు ఎంకరేజ్‌ చేస్తుండటంతో ముందూ వెనకా ఆలోచించకుండా దూకేశాడు. దూకిన వెంటనే ఈత కొడుకతూ కొంచెం ముందుకు వచ్చాడు. అంతలోనే ఏమైందో ఏమో మునిగిపోయాడు. అప్పటికే అందులో ఈత కొడుతున్నవారు రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫ్రెండ్స్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తౌసిఫ్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. నీళ్లలో దూకగానే ఆ లోతుకు టీనేజర్‌ తనను తాను నియంత్రించుకోలేకపోయాడని పోలీసులు చెప్పారు.

Updated On 22 May 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story