కర్నాటకలో(Karnataka) దారుణం సంభవించింది. టిఫిన్‌(Tiffin) పెట్టలేదన్న కారణంతో కన్నతల్లినే(Mother) దారుణంగా హత్య(Murder) చేశాడో టీనేజ్ యువకుడు. ముల్‌బాగల్‌(Mulbagal) పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్ణనంలో ఉన్న 18 ఏళ్ల యువకుడు ఉదయం ఏడు గంటల సమయంలో కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు.

కర్నాటకలో(Karnataka) దారుణం సంభవించింది. టిఫిన్‌(Tiffin) పెట్టలేదన్న కారణంతో కన్నతల్లినే(Mother) దారుణంగా హత్య(Murder) చేశాడో టీనేజ్ యువకుడు. ముల్‌బాగల్‌(Mulbagal) పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్ణనంలో ఉన్న 18 ఏళ్ల యువకుడు ఉదయం ఏడు గంటల సమయంలో కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. తల్లిని టిఫిన్‌ పెట్టమని అడిగాడు. అందుకు తల్లి నిరాకరించింది. పైగా అసలు నువ్వు నా కొడుకువే కాదని తిట్టింది. దాంతో కొడుకుకు కోపం వచ్చింది. ఆ కోపంతో విచక్షణ మరిచి ఐరన్‌ రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. దాంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దాంతో కంగారుపడిన ఆ యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిదంతా చెప్పాడు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Updated On 3 Feb 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story