ఓ వైపు దీపావళి పండగ(Dipawali festival) జరుపుకుంటూ బాంబులు(Crackers) పేల్చుతూ సంతోషంగా గడుపుతుంటే..
ఓ వైపు దీపావళి పండగ(Dipawali festival) జరుపుకుంటూ బాంబులు(Crackers) పేల్చుతూ సంతోషంగా గడుపుతుంటే.. ఉత్తరాఖండ్‌లో(Utharakhand) ఎయిడ్స్(AIDS) బాంబు పేలింది. ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్‌లో 17 ఏళ్ల వయసున్న ఓ బాలిక డ్రగ్స్‌కు(drugs) అలవాటు పడింది. డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఆమె డబ్బులు తీసుకొని యువకులతో శృంగారంలో పాల్గొంది. ఆమెతో విచ్చలవిడి శృంగారానికి(Romance) యువకులు తెగించారు. పురుషాంగానికి ప్రాకులాట ఎక్కువ అని ఓ సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ ఆమెతో సేఫ్టీ(Saftey) లేకుండా సెక్స్‌లో పాల్గొన్నారు. కొన్నాళ్ల తర్వాత ఆమెతో శృంగారంలో పాల్గొన్నవారికి అనారోగ్యం కలిగింది. దీంతో వైద్యులు పరీక్షించగా వారికి హెచ్‌ఐవీ(HIV) పాజిటివ్ వచ్చింది. ఇలా ఒక్కొక్కరుగా టెస్టులు చేయించుకుంటే 19 మందికి ఎయిడ్స్ సోకింది. ఈ వ్యవహారం బయటపడడంతో ఆ యువతితో సెక్స్‌లో పాల్గొన్నవారు ఉంటే టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది ఆందోళన కలిగించే అంశమని..తక్షణమే చర్యలు తీసుకుంటున్నాము అని జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారని, సమస్యను పరిష్కరించడానికి వివిధ ప్రాంతాల్లో కౌన్సెలింగ్ ప్రారంభించామని ఆయన తెలిపారు. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే ఎయిడ్స్ సోకిన వ్యక్తుల్లో చాలా మంది వివాహం చేసుకున్నారు. దీంతో వారి జీవిత భాగస్వాములు కూడా ఈ వ్యాధికి గురయ్యారు. వైరస్ సోకిన యువకులందరికీ ఒక కామన్ లింక్ ఉందని వారికి తెలియదని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. కౌన్సిలింగ్ సందర్భంగా 17 ఏళ్ల బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నారని చెప్పారని, ఆమె వల్లనే వారందరికీ వైరస్ సోకిందని ఆ తర్వాత వారికి తెలిసిందని చెప్పారు. డ్రగ్స్ కోసం ఆ బాలిక శారీరక సంబంధాలు పెట్టుకుందని, దురదృష్టవశాత్తు ఈ యువకులు ఆమెకు ఎరగా మారారని తెలిపారు. రామ్‌నగర్‌లో గడిచిన 17 నెలల్లో 45 మందికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.