సోషల్‌ మీడియా(Social media) విస్తృతమయ్యాక మంచితో పాటు చెడూ జరుగుతోంది.

సోషల్‌ మీడియా(Social media) విస్తృతమయ్యాక మంచితో పాటు చెడూ జరుగుతోంది. ప్రేమ దోమ అంటూ యువత(Youth) పెడదారిపడుతోంది. స్కూల్‌ పిల్లలకు(school children) కూడా ఈ జాడ్యం అంటుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ ట్యూషన్‌ టీచర్‌తో(Tution teacher) ఓ మైనర్‌ బాలుడు ప్రేమలో పడ్డాడు. ఈ ఇన్సిడెంట్‌ చెన్నై(Chennai) నగరంలోని పెరియామెట్లో జరిగింది. 22 ఏళ్ల ఓ టీచర్‌ 17 ఏళ్ల బాలుడికి ట్యూషన్‌ క్లాస్‌ తీసుకునేది. వారిద్దరి మధ్య ఉన్నది గురు శిష్య బంధమే అయినా కొంతకాలానికి అది ప్రేమబంధంగా మారింది. కొన్నాళ్ల తర్వత ఆ టీచర్‌ బాలుడిని దూరం పెట్టసాగింది. దీంతో బాలుడిలో ఉక్రోషం కట్టలు తెంచుకుంది. ఎలాగైనా సరే టీచర్‌ లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆ యువతి ఇంటి అడ్రస్‌కు వందలాది క్యాష్‌ ఆన్‌ డెలివరీ అన్‌లైన్‌ ఆర్డర్లు(Online delivery orers) పెట్టసాగాడు. ఏకంగా 77 సార్లు ఓలా, ఊబర్‌ రైడ్‌స్‌ బుక్‌ చేసి వేధించాడు. ఏకధాటిగా వస్తున్న ఆన్‌లైన్‌ ఆర్డర్ల సమాధానం చెప్పలేక ఆ యువతి కుటుంబం ఇబ్బంది పడేది. ఈ పని ఎవరు చేస్తున్నారో అర్థం కాక ఆవేదనకు గురయ్యింది. ఇకలాభం లేదనుకుని పోలీసులకు కంప్లయింట్‌ చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆన్‌లైన్‌ ఆర్డర్‌చేసిన ఐపీ నంబర్‌ ఆధారంగా మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న రెండు సెల్‌ ఫోన్‌లను, ఓ వైఫై రూటర్‌ను సీజ్‌ చేశారు.

Updated On 25 July 2024 7:52 AM GMT
Eha Tv

Eha Tv

Next Story