మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ పడిపోయింది.
మహారాష్ట్ర(Maharashtra)లోని థానే(Thane)లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం(Accident) జరిగింది. థానేలోని షాపూర్(Shahapur) సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్(Girder Launching Machine) పడిపోయింది. యంత్రం పడిపోవడంతో 16 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే(Samriddhi Express Way) మూడో దశ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో ఆ యంత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు షాపూర్ పోలీసులు తెలిపారు.
బ్రిడ్జి స్లాబ్‌పై గిర్డర్ లాంచింగ్ మెషిన్ పడిపోవడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను వెలికి తీయగా.. ముగ్గురు గాయపడ్డారు. కూలిన నిర్మాణంలో మరో ఆరుగురు చిక్కుకున్నట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తెలిపింది. అంబులెన్స్, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు(Police) తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.