వాతావరణ(weather) పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్‌(Amarnath Yatra) యాత్రకు బ్రేక్‌ పడింది. ఫలితంగా వేలాది మంది యాత్రికులు మధ్యలో చిక్కుకుపోయారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా అమర్‌నాథ్‌ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోయింది.

వాతావరణ(weather) పరిస్థితులు అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్‌(Amarnath Yatra) యాత్రకు బ్రేక్‌ పడింది. ఫలితంగా వేలాది మంది యాత్రికులు మధ్యలో చిక్కుకుపోయారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా అమర్‌నాథ్‌ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోయింది. జమ్ము-శ్రీనగర్(Jammu-srinagar) హైవే(High way) పై కొండచరియలు(Landslides) విరగిపడటంతో పహల్గాం(Pahalgam), బల్తాల్‌(Baltal) రెండు మార్గాలలోనూ యాత్రను నిలిపివేశారు. అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన వేలాది మంది భక్తులు బల్తాల్‌, నున్వాన్‌ బేస్‌, భగవతి నగర్ బేస్‌ క్యాంపుల్లో ఉండిపోయారు. పంచతర్ణి(Panchatarni) ప్రాంతంలో సుమారు 15 వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో రెండువందల మంది వరకు తెలుగువారు ఉన్నట్టు సమాచారం.

శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్‌ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ప్రస్తుతం అమర్‌నాథ్‌ యాత్రకులంతా షెల్టర్‌ స్టేషన్‌లలో సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునః ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాలలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళతారు. 62 రజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జులై 1న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమయ్యింది. ఆగస్టు 31 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు 82 వేల మంది అమర్‌నాథ్‌లోని శివలింగాన్ని దర్శించుకున్నారు.

Updated On 8 July 2023 4:41 AM GMT
Ehatv

Ehatv

Next Story