ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Cricketer) అంటే అందరికీ అభిమానమే! పాకిస్తాన్‌లో(Pakistan) కూడా ఆయనకు అభిమానులు ఎక్కువ.
ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Cricketer) అంటే అందరికీ అభిమానమే! పాకిస్తాన్‌లో(Pakistan) కూడా ఆయనకు అభిమానులు ఎక్కువ. పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? 15 ఏళ్ల ఆ బాలుడి పేరు కార్తికేయ్(Katthikey). పదో తరగతి చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఉన్నావ్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం కాన్పూర్‌లో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. కోహ్లీ అంటే కార్తికేయ్‌కు చాలా ఇష్టం. ఎలాగైనా సరే ఉన్నావ్ నుంచి కాన్పూర్‌కు వెళ్లి తను అభిమానించే కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడు. విషయాన్ని ఇంట్లో వారికి చెప్పాడు. తాము అయితే రాలేమని, నువ్వు కావాలంటే వెళ్లొచ్చని చెప్పారు. దాంతో కార్తికేయ్ తను రోజూ స్కూల్‌కు వెళ్లే సైకిల్‌పైనే(Cycle) అంత దూరం వెళ్లాడు. తన అభిమాన క్రికెటర్‌ను ప్రత్యక్షంగా చూశాడు. అయితే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోహ్లీ బ్యాటింగ్‌ను కార్తకేయ్ చూడలేకపోయాడు. ఆ పిల్లోడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.