ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand)చమోలిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం వ‌ద్ద ట్రాన్స్‌ఫార్మ‌ర్(Transform) పేలిన ఘ‌ట‌న‌లో 15 మంది మృతిచెందారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ సమయంలో 22 మంది వ్యక్తులు సంఘటనా స్థలంలో ఉన్నారని.. క్ష‌త‌గాత్రుల‌ను మొద‌ట‌ జిల్లా ఆసుపత్రికి తరలించామని.. అక్కడి నుంచి రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకువచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు

ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand)చమోలిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం వ‌ద్ద ట్రాన్స్‌ఫార్మ‌ర్(Transform) పేలిన ఘ‌ట‌న‌లో 15 మంది మృతిచెందారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ సమయంలో 22 మంది వ్యక్తులు సంఘటనా స్థలంలో ఉన్నారని.. క్ష‌త‌గాత్రుల‌ను మొద‌ట‌ జిల్లా ఆసుపత్రికి తరలించామని.. అక్కడి నుంచి రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకువచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప్లాంట్‌లో పనిచేస్తున్న వాచ్‌మెన్‌(Watchman) రాత్రి మరణించాడు. ఈ విష‌య‌మై స‌మాచారం అంద‌డంతో పోలీసులు ఉదయం అక్క‌డికి వచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో సహా ఇతర వ్యక్తులు గుమిగూడారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలి వంతెన రెయిలింగ్‌కు విద్యుత్ తాక‌డంతో క‌రెంట్ షాక్‌తో ప‌దుల సంఖ్య‌లో జ‌నాలు మృత్యువాత ప‌డ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. చమోలీ ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నమామి గంగే ప్రాజెక్టులో(Namami Gange Project) జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకూ 15 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. మృతుల సంఖ్య 15కి చేరిందని డీఐజీ రిద్ధిమ్ అగర్వాల్(Riddhim Aggarwal)ధృవీకరించారు. డీఐజీ ఎస్‌డీఆర్‌ఎఫ్ రిద్ధిమ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. చమోలీలో హెచ్‌టీ లైన్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మంది చనిపోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఘటనా స్థలంలో మొత్తం 22 మంది ఉన్నారని వెల్ల‌డించారు.

చమోలీ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. 15 మంది మృతి చెందినట్లు నిర్ధారించిన ఆయన.. విచారణకు ఆదేశించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ధామి తెలిపారు. ఆరోగ్య శాఖ‌ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్ చమోలీకి బయలుదేరారు.

Updated On 19 July 2023 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story