ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సహారన్‌పూర్‌కు(Saharanpur) చెందిన 15 నెలల ఓ బాలుడు అరుదైన వ్యాధితో(Disease) బాధపడుతున్నాడు. వ్యాధి నయం కావాలంటే 17 కోట్ల ఇంజెక్షన్ కావాలి. బాలుడి తల్లిదండ్రులు పేదవారుక కావడంతో అంత డబ్బు లేదు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సహారన్‌పూర్‌కు(Saharanpur) చెందిన 15 నెలల ఓ బాలుడు అరుదైన వ్యాధితో(Disease) బాధపడుతున్నాడు. వ్యాధి నయం కావాలంటే 17 కోట్ల ఇంజెక్షన్ కావాలి. బాలుడి తల్లిదండ్రులు పేదవారుక కావడంతో అంత డబ్బు లేదు. ఇందుకోసం విరాళాలు(Contribution) సేకరణ ప్రారంభించారు. దాతలు కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం, నొవార్టిస్ అనే ఫార్మా కంపెనీ సాయంతో చిన్నారికి ఆ ఇంజెక్షన్ లభించింది. 15 నెలల భూదేవ్ అనే బాలుడికి స్పైనల్ మస్కులర్ అట్రోపీ-టైప్1(Spinal muscular atrophy-type 1) అనే అరుదైన వ్యాధికి గురయ్యాడు. ఇది నయం కావాలంటే 17 కోట్ల ఇంజెక్షన్ అసరమైంది. దీంతో సేవ్ భూదేవ్ అనే పేరుతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ చేసి భారీగా విరాళాలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ రద్దు చేసింది. నొవార్టిస్ అనే సంస్థ కూడా బాలుడి ఇంజెక్షన్ కోసం సహాయం చేసింది. దీంతో ఆ ఇంజెక్షన్ ధర రూ.10 కోట్లకు తగ్గింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఈ ఇంజెక్షన్‌ను బాలుడికి ఇచ్చారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ భూదేవ్‌ను ఐసోలేషన్‌లో ఉంచారు.