మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఖర్గోన్ జిల్లా(Khargone District)లో ఘోర ప్రమాదం జరిగింది. బోరాడ్ నది వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కింద పడింది. నది ఎండిపోయి నీరు లేని కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15 మంది మరణించారని తెలుస్తోంది. అయితే, పోలీసులు, పరిపాలన యంత్రాంగం ఇంకా మరణాలను ధృవీకరించలేదు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఖర్గోన్ జిల్లా(Khargone District)లో ఘోర ప్రమాదం జరిగింది. బోరాడ్ నది వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కింద పడింది. నది ఎండిపోయి నీరు లేని కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15 మంది మరణించారని తెలుస్తోంది. అయితే, పోలీసులు, పరిపాలన యంత్రాంగం ఇంకా మరణాలను ధృవీకరించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్, క్లీనర్ కూడా మృతి చెందినట్లు సమాచారం. ఖార్గోన్‌లో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఖార్గోన్ నుండి ఇండోర్‌కు వెళ్తున్న MP10-P-7755 నెంబర్ గల మా శారదా ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఖర్గోన్-థిక్రి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు నదిపై ఉన్న వంతెన గుండా వెళుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయింది. పెద్ద శబ్ధం వచ్చి గందరగోళం నెలకొంది. బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. దాసంగ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులతో పాటు పోలీసులు క్షతగాత్రులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రవి జోషి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రవిజోషితో గ్రామస్తులు మాట్లాడుతూ.. బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రతిరోజు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. చాలా సార్లు మేము బస్సు డ్రైవర్లను అడ్డుకున్నామని.. కానీ వారు బెదిరించేవారిని చెప్పారు.
ఖార్గోన్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, మైనర్‌గా గాయపడిన వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.