తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలోని(Karnataka) చిక్‌బళ్లాపుర(Chikballapura) జిల్లాఓల జరిగింది. తుమకూరు తాలుకాలో ప్రభుత్వ గురుకుల(Gurukul) పాఠశాలలో చదువుకుంటున్న ఆ బాలిక ఇటీవల ఇంటికొచ్చింది. జనవరి 9వ తేదీన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు.

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలోని(Karnataka) చిక్‌బళ్లాపుర(Chikballapura) జిల్లాఓల జరిగింది. తుమకూరు తాలుకాలో ప్రభుత్వ గురుకుల(Gurukul) పాఠశాలలో చదువుకుంటున్న ఆ బాలిక ఇటీవల ఇంటికొచ్చింది. జనవరి 9వ తేదీన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. అందులో ఆ బాలిక గర్భిణి(Pregnant) అని తేలింది. వైద్యుల పర్యవేక్షణలో బాలిక ప్రసవించింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక తక్కువ బరువు ఉన్నప్పటికీ, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోక్సో చట్టం(POCSO Act) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాను గ‌ర్భం దాల్చ‌డానికి త‌న సీనియ‌ర్(Senior) కార‌ణ‌మ‌ని పోలీసుల విచార‌ణ‌లో ఆ బాలిక చెప్పింది. విచార‌ణ‌లో భాగంగా ఆమె త‌డ‌బాటుకు గురయ్యింది. ఆ తడబాటులోనే ప‌లువురి పేర్ల‌ను ప్ర‌స్తావించింది. బాలిక గ‌ర్భం దాల్చ‌డానికి కార‌కులైన వారిని గుర్తించి, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పారు. బాధితురాలితో పాటు ఆమె త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా విద్యాశాఖ ఉన్న‌త అధికారులు రియాక్టయ్యారు. గురుకులం వార్డెన్‌ను స‌స్పెండ్ చేశారు.

Updated On 12 Jan 2024 3:07 AM GMT
Ehatv

Ehatv

Next Story