అవగాహన లేకపోవడమో, అమాయకత్వమో తెలియదు కానీ ఓ 14 ఏళ్ల బాలిక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. ప్రతి అమ్మాయి జీవితంలో రుతుక్రమం తప్పనిసరి అని, ఆ సమస్యను అనుభవించాల్సిందేనని బహుశా ఆ పాపకు తెలియదు కాబోలు. మొదటి రుతుస్రావం(Periods) కారణంగా ఎదురైన బాధను ఆ బాలిక భరించలేకపోయింది. ఆ నొప్పిని తట్టుకోలేక తన జీవితాన్నే చాలించింది. ఈ ఘటన ముంబాయిలోని(Mumbai) మల్వానీ ప్రాంతంలో(Malvani) చోటు చేసుకుంది.

అవగాహన లేకపోవడమో, అమాయకత్వమో తెలియదు కానీ ఓ 14 ఏళ్ల బాలిక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. ప్రతి అమ్మాయి జీవితంలో రుతుక్రమం తప్పనిసరి అని, ఆ సమస్యను అనుభవించాల్సిందేనని బహుశా ఆ పాపకు తెలియదు కాబోలు. మొదటి రుతుస్రావం(Periods) కారణంగా ఎదురైన బాధను ఆ బాలిక భరించలేకపోయింది. ఆ నొప్పిని తట్టుకోలేక తన జీవితాన్నే చాలించింది. ఈ ఘటన ముంబాయిలోని(Mumbai) మల్వానీ ప్రాంతంలో(Malvani) చోటు చేసుకుంది. లక్ష్మిచాల్స్‌లో నివససిస్తున్న ఓ బాలికకు 14 ఏళ్ల వయసులో మెనుస్ట్రువల్‌(Mensuration) పీరియడ్స్‌ మొదలయ్యాయి. రుతుచక్రంపై ఆ బాలికకు ఎలాంటి అవగాహన లేదు. ఆ సమయంలో వచ్చే నొప్పిని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య(Suicide) చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక మానసిక ఒత్తిడితో చనిపోయిందా లేక భరించలేని నొప్పి కారణంగా చనిపోయిందా అన్నది తెలుసుకోవడానికి బాలిక స్నేహితురాళ్లను విచారిస్తామని పోలీసులు అంటున్నారు.
బాలిక ఆత్మహత్యకు దారి తీసిన అసలైన కారణం ఏమిటో తెలుసుకుంటామని అన్నారు. కాగా రుతుక్రమానికి సంబంధించి టీనేజర్లలో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. సమాజంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడే సంస్కృతి లేకపోవడం, అవమానంగా భావించడం, అవగాహన లేమి ఇలాంటి దుర్ఘటనలకు దారి తీస్తున్నాయి.

Updated On 28 March 2024 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story