ఓ బాలుడికి 14 ఏళ్లు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీటీ స్కానింగ్ చేయగా ఆశ్చర్యపోయారు.
ఓ బాలుడికి 14 ఏళ్లు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీటీ స్కానింగ్ చేయగా ఆశ్చర్యపోయారు. అతడి కడుపులో రకరకాల వస్తువులు ఉన్నాయని గుర్తించారు. బాలుడి కడుపులో బ్యాటరీలు, గొలుసులు, రేజర్ బ్లేడ్‌లు కూడా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాలుడికి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వెంటనే నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నోయిడాలోని డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టారు. సుమారు 6 గంటలపాటు ఆపరేషన్ చేసి బాలుడి కడుపు నుంచి బ్యాటరీలు, బ్లేడ్లు, స్క్రూలు వంటి దాదాపు 65 రకాల వస్తువులను బయటికి తీశారు. ఆ తర్వాత బాలుడి పరిస్థితి విషమించింది. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాలుడిని బతికుంచుకోలేకపోయారు. కడుపులోని వస్తువుల కారణంగా తీవ్రమైన పేగు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెంది బాలుడు మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తన కుమారుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని.. ఆస్పత్రికి వెళ్లడంలో ఆలస్యం జరిగినందున ఇన్ఫెక్షన్ పెరిగిపోయిందన్నారు. గుండెకూడా వేగంగా కొట్టుకునేదని తండ్రి అన్నారు. తన కొడుకు నెల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదని.. ఒక్క నెలలో జరిగిపోయిందన్నారు. గతంలో బాలుడికి ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు లేవని తెలిపాడు