తెలంగాణలో(Telangana) కరోనా వేరియెంట్(Covid Varient) కలకలం సృష్టిస్తోంది. 24 గంటల్లో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల(Active) సంఖ్య 19కి చేరింది. 925 టెస్టులు చేయగా ఆరు కేసులు నమోదవ్వగా.. హైదరాబాద్‌లో(Hyderabad) 4 కేసులు, మెదక్(Medak), రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం బెడ్లను(Beds) సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో(Telangana) కరోనా వేరియెంట్(Covid Varient) కలకలం సృష్టిస్తోంది. 24 గంటల్లో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల(Active) సంఖ్య 19కి చేరింది. 925 టెస్టులు చేయగా ఆరు కేసులు నమోదవ్వగా.. హైదరాబాద్‌లో(Hyderabad) 4 కేసులు, మెదక్(Medak), రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం బెడ్లను(Beds) సిద్ధం చేస్తోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. నాంపల్లిలో(Nampally) 14 నెలల చిన్నారికి కరోనా సోకిండంతో నీలోఫర్ ఆస్పత్రిలో(Nilofar Hospital) చికిత్స పొందుతోంది. ఆ చిన్నారికి ఆక్సిజన్ ఏర్పాటు చేశామని వైద్యులు వెల్లడించారు. మాస్కులు(Mask) తప్పనిసరిని చేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు నిబంధనలు విధించాయి. మరోవైపు ఏపీలోనూ ఇప్పిటికే మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనాపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షించారు.
దేశంలో 24 గంటల్లో 594 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే వైరస్‌తో ఆరుగురు మృతి చెందడం కలవర పెడుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరింది. అంతేకాకుండా కొత్త వేరియెంట్ జేఎన్1(JN 1) కేరళ(Kerala) సహా పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.