వెనుకటికి రాజుల పెళ్లిళ్లు ఎలా ఉండేవో మనం చూళ్లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ కొరత తీరుస్తున్నారు ముకేశ్ అంబానీ(Mukesh ambani)
వెనుకటికి రాజుల పెళ్లిళ్లు ఎలా ఉండేవో మనం చూళ్లేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ కొరత తీరుస్తున్నారు ముకేశ్ అంబానీ(Mukesh ambani). అపర కుబేరుడు అయిన ముకేశ్ ఇంట్లో పెళ్లంటే మాటలా? ఆకాశమంతా పందిరి, భూదేవంతటి పీట ఉండాల్సిందే కదా! ప్రీ వెడ్డింగ్ వేడుకలకే 2,500 రుచుల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. మరి పెళ్లికి ఇంకెన్ని వేల రుచులు ఉంటాయో ఊహించుకోండి! ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ(anath ambani) మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలకెక్కబోతున్నాడు. జూలై 12వ తేదీన జరిగే ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి భోజనాలు పెడతారన్న ఆసక్తి చాలా మందికి ఉంది. మొత్తం మెనూ తెలియదు కానీ కొంత మాత్రం తెలిసింది. దాదాపు మూడు వేల రుచులతో వంటకాలు ఉంటాయట! దేశ విదేశీ ప్రముఖుల్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రుచులతో పాటు, కాంటినెంటల్ వంటకాలను కూడా పెళ్లిలో వడ్డించబోతున్నారు. ఇప్పటికే పలు దేశాల నుంచి చెఫ్‌లు ముంబాయికి(mumbai) వచ్చారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో చెఫ్ లకు కౌంటర్లు కేటాయించారు. రేపట్నుంచే వాళ్లు ప్రిపరేషన్ మొదలుపెడతారు. ప్రపంచంలో దొరికే అద్భుతమైన వంటకాలన్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. ఈ భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారణాశిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణ. మొన్నామధ్య నీతా అంబానీ కాశీకి వెళ్లారు. అక్కడ కాశీ చాట్ బండార్‌లోని ఫుడ్డును టేస్ట్ చేశారు. ఆ రుచులు ఆమెకు బాగా నచ్చడంతో, ప్రత్యేకంగా ఆ కౌంటర్ ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ ఛాట్, టమాట ఛాట్, పాలక్ ఛాట్, కుల్ఫీ, ఫలూదా ఇక్కడ ప్రత్యేకతలు. ఆ చాట్ బండార్ యజమానే స్వయంగా ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు. పారిశ్రామికవేత్త వీరెన్ మర్చంట్ కూతురు రాధికతో అనంత్ అంబానీ పెళ్లి జరగబోతున్నది.
మార్చి 1వ తేదీన మొదలైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీన జియో కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి ఉంటుంది. ఆ రోజున ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్‌తో మొదలయ్యే ఈ వేడుకలు జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జులై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్‌తో ముగుస్తాయి.