బెంగళూరుకు(Bangalore) చెందిన 13 ఏళ్ల బైక్ రైడర్(Bike Rider) శ్రేయాస్ హరీష్(Shreyas Harish) మృతి చెందాడు. మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (ISMRC) రౌండ్ 3లో రేసింగ్ చేస్తుండగా శ్రేయాస్ హరీష్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో శ్రేయాస్ హరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత..
బెంగళూరుకు(Bangalore) చెందిన 13 ఏళ్ల బైక్ రైడర్(Bike Rider) శ్రేయాస్ హరీష్(Shreyas Harish) మృతి చెందాడు. మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (INMRC) రౌండ్ 3లో రేసింగ్ చేస్తుండగా శ్రేయాస్ హరీష్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో శ్రేయాస్ హరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత.. ఈవెంట్ ప్రమోటర్లు, మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్.. శని, ఆదివారాల్లో రేసింగ్ ఈవెంట్‌ను రద్దు చేసింది.
జూలై 26, 2010న జన్మించిన శ్రేయాస్.. బెంగుళూరులోని కేన్సరి స్కూల్ విద్యార్థి. మోటర్‌బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని జాతీయ స్థాయిలో TVS వన్-మేక్ ఛాంపియన్‌షిప్‌తో సహా అనేక రేసులను శ్రేయస్ గెలుచుకున్నాడు.
శనివారం ఉదయం పోల్ పొజిషన్‌పై అర్హత సాధించిన రూకీ రేసులో శ్రేయాస్ హరీష్‌కు ఈ ప్రమాదం జరిగింది. టర్న్-1 నుంచి బయటకు వచ్చే సమయంలో శ్రేయాస్ బైక్ పై నుంచి కిందపడి తలకు బలమైన గాయమైందని నిర్వాహకులు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వెంటనే రేసును నిలిపివేసి, ట్రామా కేర్ అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు ప్రకటించారు. ఎంఎంఎస్సీ ప్రెసిడెంట్ అజిత్ థామస్ మాట్లాడుతూ.. “ఇంతటి యువ ప్రతిభావంతుడైన రైడర్‌ను కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మేలో మినీ GP ఇండియా టైటిల్‌ను శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన మినీ GP రేసులో పాల్గొన్నాడు.