తోబుట్టువుకు అన్నీ(Brother) తానై తోడుగా ఉండి కాపాడాల్సిన అన్నే కామాంధుడిగా మారాడు.
తోబుట్టువుకు అన్నీ(Brother) తానై తోడుగా ఉండి కాపాడాల్సిన అన్నే కామాంధుడిగా మారాడు. అన్న.. చెల్లి.. వారిద్దరూ మైనర్లే. ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల చెల్లిపై 16 ఏళ్ల సొంత అన్ననే పలుమార్లు లైంగికదాడికి(Sexual assault) పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. సొంత కొడుకే కూతురుకు కడుపు(Pregnant) చేయడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో(Surat) ఇది జరిగింది.
దిండోలి పోలీసులు వెల్లడించిన ప్రకారం తల్లిదండ్రులు వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఉదయం వెళ్లి రాత్రికి కానీ తిరిగి వచ్చేవారు కాదు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్కూల్ మానేసి ఓ ఫుడ్ కోర్టులో పనిచేసేవాడు. ఉదయం వెళ్లి మ.2 గంటలకు తిరిగి వచ్చేవాడు. బాలిక ఉదయం స్కూల్‌కు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చేది. ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవారు. అయితే బాలుడు పలు శృంగార సన్నివేశాలు టీవీలో చూసేవాడు. ఐదు నెలల క్రితం బాలుడు ఆమెపై మూడుసార్లు అత్యాచారం చేశాడు. కొద్ది రోజుల క్రితం బాలిక కడుపునొప్పితో బాధపడింది. తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె 16-20 వారాల గర్భవతి అని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఎవరా పనిచేసిందని ఆరా తీయగా.. అన్ననే చేశాడని తెలపడంతో తల్లిదండ్రులు రోదించసాగారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.