మహారాష్ట్రలోని రాయగఢ్(Raigad) జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు 150 అడుగుల లోతైన లోయ‌లో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మ‌రో 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని రాయగఢ్(Raigad) జిల్లాలో శనివారం తెల్లవారుజామున బస్సు 150 అడుగుల లోతైన లోయ‌లో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మ‌రో 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పూణే(Pune)లోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్‌కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్‌గఢ్(Pune-Raigad) సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు(Rescue operations) కొనసాగుతున్నాయి.

అంత‌కుముందు రాయ్‌గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే(Raigad SP Somnath Gharge) మీడియాతో మాట్లాడుతూ.. రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడటంతో ఏడుగురు మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు భారీగా చేరుకున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సివుంది.

Updated On 16 April 2023 5:17 AM GMT
Yagnik

Yagnik

Next Story