మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. గుణ(Guna) ప్రాంతంలో ఓ ప్రయివేట్ బస్సును టక్రు ఢీకొట్టిన ఘటనలో 12 మంది సజీవ దహనం (many burnt alive)అయ్యారు. మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తునున్నారు.

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..మంటల్లో 12 మంది సజీవ దహనం

మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. గుణ(Guna) ప్రాంతంలో ఓ ప్రయివేట్ బస్సును టక్రు ఢీకొట్టిన ఘటనలో 12 మంది సజీవ దహనం (many burnt alive)అయ్యారు. మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తునున్నారు.

మధ్యప్రదేశ్‌లోని గుణ(MadhyPradesh Guna)లో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో గుణ నుంచి ఆరోన్ వెళ్తున్న బస్సును డంపర్ ‎ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు(Burning passengers alive). తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుణ జిల్లా(Guna District) సెమ్రీ(Semri) సమీపంలో రాత్రి 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం సమయంలో బస్సులో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు..మంటలను ఏ మాత్రం లెక్కచేయకుండా కొందరు ప్రయాణికుల్ని రక్షించారు. తనను ఎవరో ముగురు నలుగురు బస్సు నుంచి బయటకు తీశారని బస్సులోని ప్రయాణీకుడొకడు చెప్పాడు. ఆ తరువాత బస్సులోంచి మంటలు చెలరేగడంతో ఎవరూ బయటకు రాలేకపోయినట్టు తెలిపాడు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్(Madhya Pradesh chief minister Mohan Yadav) విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు, గాయపడివారికి 50 వేల రూపాయలు సహాయం(exgratia)ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని రవాణాశాఖ అధికారుల్ని ఆదేశించారు.

Updated On 27 Dec 2023 11:17 PM GMT
Ehatv

Ehatv

Next Story