కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala Temple)కు భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప భక్తులతో నిండిపోయింది.

Shabarimalai Accident
కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala Temple)కు భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఓ 11 ఏళ్ల బాలిక(Girl) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తమిళనాడుకు(tamilnadu) చెందిన ఈ బాలిక కుప్పకూలడాన్ని చూసిన ఆలయ అధికారులు వెంటనే ఆ చిన్నారని ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. గత మూడేళ్లుగా ఆ పాప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నదట! ఇదిలా ఉంటే క్యూలైన్లో(Que Line) ఎక్కువ సమయం వేచి చూడలేని భక్తులు బారికేడ్‌లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పవిత్ర మెట్ల దగ్గర రద్దీ ఎక్కువవుతోంది. అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు.
