మిజోరం అసెంబ్లీ ఎన్నికలు(mizoram assembly election ) వచ్చే నెల 7వ తేదీన జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రం కాబట్టి ఎవరూ ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మిజోరం అంటే అదేదో పేద రాష్ట్రమనుకుంటారు కానీ అక్కడ పోటీ చేసే అభ్యర్థులంతా కోటికి పగడలెత్తినవారే! ఎన్నికల బరిలో దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనట(Milliniors)! అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు(mizoram assembly election ) వచ్చే నెల 7వ తేదీన జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రం కాబట్టి ఎవరూ ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మిజోరం అంటే అదేదో పేద రాష్ట్రమనుకుంటారు కానీ అక్కడ పోటీ చేసే అభ్యర్థులంతా కోటికి పగడలెత్తినవారే! ఎన్నికల బరిలో దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనట(Milliniors)! అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. చిత్రమేమిటంటే బరిలో నిల్చున్నవారిలో అత్యంత ధనవంతుడు ఆమ్ ఆద్మీ పార్టీకి(Aam Aadmi Party) చెందిన వ్యక్తి కావడం! ఆప్(AAP) రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రెంకిమా పచువాకు 69 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. పచువా ఐజ్వాల్ నార్త్-III నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన తర్వాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆర్‌వన్‌లాలత్లుంగానే ధనవంతుడు. ఈయనకు 55.6 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. చంపై నార్త్ నుంచి పోటీ చేస్తున్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన హెచ్ గింజలాలా 36.9 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ధనవంతుల గురించి చెప్పుకున్నప్పుడు పేదల గురించి కూడా చెప్పుకోవాలి కదా! సెర్చిప్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌లున్-ఎడెనా దగ్గర కేవలం 15 వందల రూపాయల విలువైన చరాస్తులు మాత్రమే ఉన్నాయట! వయసు రిత్యా అత్యంత పెద్దవారు ఉప ముఖ్యమంత్రి తవాన్‌పుయ్. ఈయన టుయిచాంగ్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 31 ఏళ్ల ఎఫ్ వాన్‌హమింగ్‌తంగా ఎన్నికల బరిలో దిగిన అతి పిన్న వయస్కురాలు!