అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగి ఇంచుమించు మూడు నెలలు కావొస్తోంది. ప్రాణప్రతిష్ట తర్వాత ఆ రామాలయంలో మొదటిసారి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నాయి.
అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగి ఇంచుమించు మూడు నెలలు కావొస్తోంది. ప్రాణప్రతిష్ట తర్వాత ఆ రామాలయంలో మొదటిసారి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యలోని రామాలయానికి ప్రసాదంగా పంపనున్నట్టు దేవ్‌రహ హన్స్ బాబా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీ అతుల్‌కుమార్ సక్సెనా చెప్పారు. కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నామన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన రోజున కూడా దేవ్‌రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూలను నైవేద్యంగా పంపింది. అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఆర్మీ హెలికాఫ్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపించాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు అయోధ్యలో సందడి వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 17వ తేదీన రామనవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచే ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసుకుంటాయి.