టమాటా (Tomatoes)రేటు కొండెక్కి కూర్చోవడం వల్ల ఎన్నడూ చూడని చిత్ర విచిత్రాలను చూడాల్సి వస్తున్నది. ఎప్పుడైనా టమాటాలు దొంగలెత్తుకెళ్లడం విన్నామా? టమాటా పంటకు సెక్యూరిటీ పెట్టడాన్ని చూశామా? టమాట విక్రేతలు బాక్సర్లను నియమించుకోవడం, టమాటా లారీ(Tomatoes Truck) బోల్తా పడితే నిమిషంలో టమాటాలు ఎత్తుకెళ్లడం ఇలాంటి వింతలన్నీ చూసే భాగ్యం ఇప్పుడు కలిగింది.
టమాటా (Tomatoes)రేటు కొండెక్కి కూర్చోవడం వల్ల ఎన్నడూ చూడని చిత్ర విచిత్రాలను చూడాల్సి వస్తున్నది. ఎప్పుడైనా టమాటాలు దొంగలెత్తుకెళ్లడం విన్నామా? టమాటా పంటకు సెక్యూరిటీ పెట్టడాన్ని చూశామా? టమాట విక్రేతలు బాక్సర్లను నియమించుకోవడం, టమాటా లారీ(Tomatoes Truck) బోల్తా పడితే నిమిషంలో టమాటాలు ఎత్తుకెళ్లడం ఇలాంటి వింతలన్నీ చూసే భాగ్యం ఇప్పుడు కలిగింది. లేటెస్ట్‌గా 21 లక్షల రూపాయల విలువైన 11 టన్నుల(11 tons) టమాటా లోడుతో బయలుదేరిన లారీ(Lorry) కనిపించకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) భోపాల్‌లో(Bhopal) జరిగింది. కర్ణాటకలోని కోలార్‌లో ఉన్న ఎస్‌వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటా లోడుతో లారీ గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు బయలుదేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టోల్‌గేట్ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్ సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం లారీ ఎంత వరకు వెళ్లిందో తెలుసుకుందామని డ్రైవర్‌కు ఫోన్ చేశాడు మునిరెడ్డి. నంబర్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. లారీకి అమర్చని జీపీఎస్ ట్రాకర్ లోకేషన్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో మునిరెడ్డిలో ఆందోళన మొదలయ్యింది. వెంటనే వెళ్లి కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. టమాటాలతో ఉన్న లారీని డ్రైవరే ఎత్తుకెళ్లాడా? లేక డ్రైవర్‌ను ఏమైనా చేసి దుండగులు ఎత్తుకెళ్లారా? లేకపోతే మొబైల్ నెట్‌వర్క్ సమస్య వల్ల డ్రైవర్‌కు ఫోన్ కలవడం లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.