దేశ రాజధాని ఢిల్లీలో (delhi)ఘోర అగ్ని ప్రమాదం( fire accident) చోటు చేసుకుంది. అలీపూర్‌లో (alipur)ఓ పెయింట్ ఫ్యాక్టరీలో (paint factory)సంభవించిన పేలుడుతో మంటలు చెలరేగాయి

Delhi Fire Accident
దేశ రాజధాని ఢిల్లీలో (delhi)ఘోర అగ్ని ప్రమాదం( fire accident) చోటు చేసుకుంది. అలీపూర్‌లో (alipur)ఓ పెయింట్ ఫ్యాక్టరీలో (paint factory)సంభవించిన పేలుడుతో మంటలు చెలరేగాయి. ఆ అగ్నికి పదకొండు మంది ఆహుతి అయ్యారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ మరి కొందరి ఆచూకీ దొరకలేదు. దాంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలీపూర్ దయల్‌పూర్ మార్కెట్‌లో గురువారం సాయంత్రం ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల ఇళ్లకు, దుకాణాలకు కూడా వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని, రాత్రి 9 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ సర్వీసు అధికారి తెలిపారు. మంటలను 22 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం మీద అదుపులోకి తెచ్చామన్నారు.
ఫ్యాక్టరీలోని రసాయనాల వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
