కాటికి కాళ్లు జాపుకున్న వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా? అని కోపగించుకోకండి. ఏ అవసరం వచ్చిందో ఏమో ఏమో ఆ ముత్తాతగారికి! 103 ఏళ్ల వయసులో ఎంచక్కా 49 ఏళ్ల మహిళను పెళ్లి(Marriage) చేసుకున్నాడు. అన్నట్టు ఈ వృద్దుడికి ఇది మూడో పెళ్లి(Third marriage). ఇద్దరు భార్యలు చనిపోయిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నానని ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పాడు.
కాటికి కాళ్లు జాపుకున్న వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా? అని కోపగించుకోకండి. ఏ అవసరం వచ్చిందో ఏమో ఏమో ఆ ముత్తాతగారికి! 103 ఏళ్ల వయసులో ఎంచక్కా 49 ఏళ్ల మహిళను పెళ్లి(Marriage) చేసుకున్నాడు. అన్నట్టు ఈ వృద్దుడికి ఇది మూడో పెళ్లి(Third marriage). ఇద్దరు భార్యలు చనిపోయిన కారణంగా మూడో పెళ్లి చేసుకున్నానని ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పాడు. తన మూడో భార్యతో షికార్లు కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో(social media) వైరల్ అవుతున్నాయి. ఆయన నామధేయము హబీబ్ నాజర్. మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన వ్యక్తి. స్వాతంత్రసమరంలోనూ పాల్గొన్నాడు. ఆయన ఇద్దరు భార్యలు ఇప్పటికే చనిపోయారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న ఆయన ఒంటరిగా బతకాలని అనుకోలేదు. అందుకే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ అనే మహిళ ఆయనను కట్టుకోవడానికి ఒప్పుకున్నారు. 'నాకు నాసిక్‌లో మొదటిసారి వివాహం అయింది. ఆమె చనిపోయాక లక్నోలో మరో వివాహం చేసుకున్నాను. దురదృష్టం కొద్దీ రెండో భార్య కూడా చనిపోయింది. నాకు జీవితం ఒంటరిగా అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు. అందుకే మరో వివాహం చేసుకున్నాను.' అని హబీబ్ నాజర్ తెలిపాడు. ఫిరోజ్ జహాన్‌కు ఇది రెండో వివాహం. తన భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా ఆమె జీవిస్తోంది. 103 ఏళ్ల హబీబ్ నాజర్‌కు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఆయనకు చూసుకునే వారు ఎవరూ లేనందున వివాహానికి జహాన్ ఒప్పుకుంది.