అమెరికాలోని హవాయి దీవుల్లో(US Hawaii Islands) సంభవించిన కార్చిచ్చు (Maui Wildfires) పెను విధ్వంసాన్ని సృష్టించింది. సుమారు 70 మంది ప్రాణాలు తీసింది. అనేక భవంతులను దగ్ధం చేసింది. మూగజీవుల ఉసురు తీసుకుంది. వేలాది మందికి నిలువ నీడ లేకండా చేసింది. అగ్నికీలల్లో ఎన్నో చెట్లు కాలి బూడిదయ్యాయి. అమెరికాలోనే అతి పెద్ద మర్రిచెట్లలో(banyan tree) ఒకటైన పానియానా (Paniana) కూడా దెబ్బతింది.

అమెరికాలోని హవాయి దీవుల్లో(US Hawaii Islands) సంభవించిన కార్చిచ్చు (Maui Wildfires) పెను విధ్వంసాన్ని సృష్టించింది. సుమారు 70 మంది ప్రాణాలు తీసింది. అనేక భవంతులను దగ్ధం చేసింది. మూగజీవుల ఉసురు తీసుకుంది. వేలాది మందికి నిలువ నీడ లేకండా చేసింది. అగ్నికీలల్లో ఎన్నో చెట్లు కాలి బూడిదయ్యాయి. అమెరికాలోనే అతి పెద్ద మర్రిచెట్లలో(banyan tree) ఒకటైన పానియానా (Paniana) కూడా దెబ్బతింది. శతాబ్దంన్నర కాలంగా తమతో పెనవేసుకుపోయిన ఆ మహావృక్షం దుస్థితి చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ఈ మర్రిచెట్టుతో భారత్‌కు సంబంధం ఉండటం గమనించదగ్గ విషయం. 1873లో ఓ క్రైస్తవ కార్యక్రమం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత్‌ నుంచి ఈ మర్రిమొక్కను లహైనాకు తీసుకెళ్లారు. అక్కడ ఆ ఎనిమిది అడుగుల మొక్కను నాటారు. ఆ మొక్క ఇప్పుడు మహావృక్షమయ్యింది. 60 అడుగుల ఎత్తుతో, 46 భారీ ఊడలతో, బలమైన కొమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరించింది. అమెరికాలోని అతి పెద్ద మర్రిచెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ మర్రిచెట్టుకు 150 ఏళ్ల వేడుకలను కూడా నిర్వహించారు.

అంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ తరువు ఇప్పుడు అగ్నికీలల్లో చిక్కుకుని కాలిపోవడం విషాదం. ప్రస్తుతం అది నిలబడే ఉంది. ఒకవేళ ఆ చెట్టు వేర్లు ఆరోగ్యంగా ఉంటే తిరిగి చిగురించే అవకాశం ఉందని అంటున్నారు. మళ్లీ పచ్చని చెట్టుగా మారవచ్చని చెబుతున్నారు. నిజానికి ఓ మర్రి చెట్టును నాశనం చేయడం కష్టం. అందుకే దాని పునరుజ్జీవనంపై నమ్మకం పెట్టుకున్నారు స్థానికులు. సుమారు ఓ ఎకరం వరకు విస్తరించిన ఈ మహా వృక్షం లహైనాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచంది. ఈ చెట్టు కింద ఎన్నో వేడుకలు, కళా ప్రదర్శనలు జరిగాయి. దీని నిర్వహణ బాధ్యతలను మౌయి కౌంటీ అర్బరిస్ట్ కమిటీ చూసుకుంటుంది.

Updated On 12 Aug 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story