ఏడాది వయసు కూడా లేని బాబుకు బొమ్మోదో పామేదో ఎలా తెలుస్తుంది?

ఏడాది వయసు కూడా లేని బాబుకు బొమ్మోదో పామేదో ఎలా తెలుస్తుంది? తెలియదు కాబట్టే పాముతో(Snake) ఆటాడుకున్నాడు. దాన్ని ఆట వస్తువుగా భావించి నోట్లో పెట్టుకున్నాడు. గట్టిగా(Bite) నమిలేశాడు. దాంతో పాము చచ్చి ఊరుకుంది. ఆ చిన్నారి కొరుకుతున్నప్పుడు బాధను భరించిందే తప్ప కాటేయకపోవడం విశేషం. ఇంతలో పిల్లోడి తల్లి వచ్చింది. బాబు నోట్లోంచి రక్తం రావడం, పక్కనే పాము చచ్చిపడి ఉండటం చూసి కంగారుపడింది. భయంతో పిల్లోడిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది. ఈ ఘటన బీహార్‌లోని(Bihar) గయాలో జరిగింది. ఫతేపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జముహర్‌ గ్రామంలో ఏడాది వయసున్న పసిబాలుడు ఇంటి టెర్రస్‌పై(Terrace) ఆడుకుంటున్నాడు. అక్కడికి ఓ మూడడుగుల పాము వచ్చింది. అదో ఆట వస్తువు అనుకున్నాడో ఏమో కానీ ఆ పిల్లోడు దాన్ని పట్టుకుని కాసేపు ఆడుకున్నాడు. తర్వాత చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమిలాడు. దాంతో పాము చనిపోయింది. ఇంతలో అక్కడి వచ్చిన చిన్నారి తల్లి అక్కడి దృశ్యాన్ని చూసి భయపడింది. చనిపోయిన పామును బయటపడేసి, పిల్లోడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. జరిగిందంతా డాక్టర్లకు చెప్పింది. అన్ని రకాల పరీక్షలు చేసిన డాక్టర్లు పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. చనిపోయిన పాము విషం లేనిదని, అది కాటు వేసినా ప్రమాదం ఉండదని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story