మన దేశంలో నిరుద్యోగం(Unemployeement) ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ వార్త చూస్తే తెలుస్తోంది.

మన దేశంలో నిరుద్యోగం(Unemployeement) ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ వార్త చూస్తే తెలుస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెప్పకున్నా నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. పాలకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఈ దేశంలో నిరుద్యోగ స్థాయి ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. హర్యానా(Haryana) ప్రభుత్వం పలు కార్పొరేషన్లు, ప్రభుత్వశాఖలు, బోర్డుల ఆధ్వర్యంలో నడిచే ఆఫీసుల్లో స్వీపర్‌ పోస్టులకు(Sweeper Jobs) నోటిఫికేషన్‌ ఇచ్చింది. పోస్టుల సంఖ్య బహిర్గతం చేయలేదు. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి వరకు చదివిన 1.2 లక్షల మంది అభ్యర్థులతో పాటు 46,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6,000 మంది గ్రాడ్యుయేట్లు పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు హర్యానా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు మరియు పౌర సంస్థల క్లీన్ ఆఫీసులకు స్వీపర్ ఉద్యోగ పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పోస్టుకు ఎంపికైన వ్యక్తులు బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, భవనాల నుంచి చెత్తను శుభ్రం చేయడం, ఊడ్చివేయడం, తొలగించడం కూడా చేయాలి.

ఆగస్ట్ 6 నుంచి సెప్టెంబర్‌ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులకు సొంత జిల్లాలో పోస్టింగ్‌ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ ఉద్యోగులకు నెలకు 15 వేల వరకు జీతం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ అయిన హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ (HKRN) ద్వారా విద్యావంతులైన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్‌ జాబ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story