మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సోమవారం రాత్రాంతా ఘర్షణలు జరిగాయి. ఇందులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను చనిపోయారు. అసోం రైఫిల్‌ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యింది. గత నెల 3వ తేదీన జరిగిన అల్లర్లలో మెయితీ- కుకీ తెగల మధ్య గొడవ జరిగింది. తదనంతరం అది హింసకు దారి తీసింది. ఈ హింసాకాండలో సుమారు 70 మంది చనిపోయారు. మెయితీ తెగ వారు తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తుంటే కుకీ తెగ వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. సోమవారం రాత్రాంతా ఘర్షణలు జరిగాయి. ఇందులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను చనిపోయారు. అసోం రైఫిల్‌ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యింది. గత నెల 3వ తేదీన జరిగిన అల్లర్లలో మెయితీ- కుకీ తెగల మధ్య గొడవ జరిగింది. తదనంతరం అది హింసకు దారి తీసింది. ఈ హింసాకాండలో సుమారు 70 మంది చనిపోయారు. మెయితీ తెగ వారు తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తుంటే కుకీ తెగ వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు తెగల మధ్య గొడవకు ఇదే కారణం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది వేల అస్సాం రైఫిల్‌ బలగాలను మోహరించాయి. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోంమం్రి అమిత్‌ షా మణిపూర్‌లో పర్యటించారు. పరిస్థితి నెమ్మదిగా అదుపులోకి వస్తుందనుకుంటున్న సమయంలో మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ సుగ్ను, సెరో ప్రాంతంలో బిఎసెఫ్ బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్‌ జవాను మరణించగా, అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బులెట్ గాయాలయ్యాయి.

Updated On 6 Jun 2023 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story