హర్యానా అసెంబ్లీ ఎన్నికలు(Haryana Assembly ELections) దగ్గరపడుతున్నాయి.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు(Haryana Assembly ELections) దగ్గరపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ(Congress) దూకుడుమీద ఉంది. సర్వేలు ఈ పార్టీకే పట్ట కడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌(Vinesh phogat), బజరంగ్‌ పునియా(Bajarang Punia) కాంగ్రెస్‌లో చేరారు. వీరిద్దరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

ఈ సందర్భంగా రెజ్లర్లు మీడియాతో ముచ్చటించారు. తమ పోరాటం ఇంకా ముగియలేదని, పోరాటం కొనసాగుతుందని వినేశ్‌ ఫోగట్‌ తెలిపారు. ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని, ఆ పోరాటంలో కూడా విజయం సాధిస్తామని, తాము తీసుకున్న నిర్ణయంతో దేశ సేవకు కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. 'మా అక్కాచెల్లెళ్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఎవరూ లేకున్నా నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే హామీ ఇస్తున్నా’ అంటూ వినేశ్‌ ఫోగట్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని, దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు బజరంగ్‌ పునియా. వినేశ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన రోజు దేశంలో అందరూ సంతోషించారని, మరుసటి రోజు అందరూ బాధపడ్డారని ఆయన అన్నారు. తాము కేవలం రాజకీయాలు చేయాలనుకోవడం లేదని, మహిళల కోసం గొంతు వినిపించేందుకు ముందుకు వస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియాలిద్దరూ రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 5 తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పదిలోపు సీట్లే ఇవ్వాలనుకుంటోంది. కానీ, ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది.

Eha Tv

Eha Tv

Next Story