వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌(World Chess Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌(Transgender) మహిళా(Female) చెస్‌ క్రీడాకారిణులపై నిషేధం విధించింది. మహిళల ఈవెంట్లలో ట్రాన్స్‌జెండర్‌ మహిళలు పాల్గొనరాదనే కొత్త నియమాన్ని తీసుకొచ్చింది.

వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌(World Chess Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్‌(Transgender) మహిళా(Female) చెస్‌ క్రీడాకారిణులపై నిషేధం విధించింది. మహిళల ఈవెంట్లలో ట్రాన్స్‌జెండర్‌ మహిళలు పాల్గొనరాదనే కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ చెస్‌ సమాఖ్య కొత్త మార్గ దర్శకాల ప్రకారం ట్రాన్స్‌జెండర్‌ మహిళా చెస్‌ క్రీడాకారిణులు ఇక నుంచి మహళల ఈవెంట్లలో పాల్గొనలేరు. తదుపరి విశ్లేషణ జరిగే వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ట్రాన్స్‌జెండర్‌ మహిళగా గెలిచిన టైటిళ్లను రద్దు చేయనున్నట్టు వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. క్రీడాకారులు తమ లింగమార్పిడి విషయాన్ని చెస్‌ పోటీల నిర్వాహకులకు చెప్పాలని ప్రపంచ చెస్‌ సమాఖ్య తెలిపింది. ఫిడే తీసుకున్న ఈ నిర్ణయాన్ని గే మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ట్రాన్స్‌ మహిళలను అవమానించడమేనని అంటున్నారు.

Updated On 17 Aug 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story